అఫ్ఘాన్ టీ20 మ్యాచ్ లో తండ్రీకొడుకులు.. ఫస్ట్ బాల్ కే సిక్స్ కొట్టిన కొడుకు.. వీడియో ఇదిగో!
- కొడుకుతో కలిసి ఆడుతున్న అఫ్ఘాన్ ఆల్ రౌండర్
- స్పాగేజా క్రికెట్ లీగ్ లో ప్రత్యర్థులుగా మొహమ్మద్ నబీ, హసన్ ఐసాఖిల్
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
అఫ్ఘనిస్థాన్ జట్టులో ఆల్ రౌండర్ గా రాణిస్తున్న మొహమ్మద్ నబీ (40) ఈ టోర్నీలో మిస్ ఐనక్ రీజియన్ జట్టు తరఫున ఆడుతుండగా.. ఆయన కొడుకు హసన్ ఐసాఖిల్ (18) అమో రీజియన్ జట్టులో ఆడుతున్నాడు. తాజాగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగగా.. నబీ బౌలింగ్ చేశాడు. అటువైపు ఆయన కొడుకు ఐసాఖిల్ బ్యాటింగ్ చేశాడు. అయితే, తండ్రి వేసిన తొలి బంతినే ఐసాఖిల్ సిక్సర్ గా మలిచాడు.
సాధారణంగా కొడుకు సిక్స్ కొడితే ఏ తండ్రికైనా సంతోషమే. స్టాండ్స్ లో ఉండి చూస్తుంటే నబీ కూడా సంతోషంతో చప్పట్లు చరిచేవాడేమో కానీ తాను వేసిన బంతిని కొడుకు సిక్సర్ కొట్టడంతో ఎలాంటి ఎక్స్ ప్రెషన్ ఇవ్వలేదు. ఆ ఓవర్ లో నబీ మొత్తం 12 పరుగులు ఇవ్వగా.. ఈ మ్యాచ్ లో ఐసాఖిల్ హాఫ్ సెంచరీ (36 బంతుల్లో 52 పరుగులు) చేశాడు.