హరిహర వీరమల్లు పార్ట్-2పై పవన్ కల్యాణ్ స్పందన
- హరి హర వీరమల్లు సినిమాపై నిన్న మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్
- పార్ట్ – 2 షూటింగ్ 20- 30 శాతం పూర్తయిందన్న పవన్ కల్యాణ్
- సర్వాయి పాపన్న కథతో దీనికి సంబంధం లేదన్న పవన్ కల్యాణ్
రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా పార్ట్ -2 ను వచ్చే డబ్బులు, తనకున్న సమయాన్ని బట్టి చేస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. అందుకు భగవంతుడి ఆశీస్సులు కూడా కావాలని అన్నారు. ఇప్పటికే పార్ట్ – 2 షూటింగ్ 20 – 30 శాతం పూర్తయిందని వెల్లడించారు.
మూవీ విషయానికి వస్తే.. ఇక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లిపోయిన కోహినూర్ వజ్రాన్ని తీసుకొచ్చే వీరుడి కథ ఇది అని తెలిపారు. 'హరి హర వీరమల్లు' పూర్తి ఫిక్షనల్ స్టోరీ అని తెలిపారు. సర్వాయి పాపన్న కథతో దీనికి సంబంధం లేదని పేర్కొన్నారు.