Pawan Kalyan: నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే...!
- నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారంటూ గతంలో ప్రచారం
- ఎమ్మెల్సీ ఇచ్చింది అందుకేనంటూ వార్తలు
- ఈ విషయం నేనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అంటూ పవన్ వెల్లడి
తన సోదరుడు, జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి పదవిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఓ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. తమవైపు నుంచి దీనిపై ఇంకా చర్చింలేదని అన్నారు. ఈ విషయంలో నేనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అని స్పష్టం చేశారు. రాజకీయాల్లో కొన్నిసార్లు ఇబ్బందులు సహజమేనని తెలిపారు.
నాగబాబుకు మంత్రి పదవి ఖాయమని, అందుకే ఎమ్మెల్సీ ఇచ్చారని గతంలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత నాగబాబు ఎమ్మెల్సీ అయినా ఈ అంశం ఇంకా ఓ కొలిక్కి రాలేదు.
నాగబాబుకు మంత్రి పదవి ఖాయమని, అందుకే ఎమ్మెల్సీ ఇచ్చారని గతంలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత నాగబాబు ఎమ్మెల్సీ అయినా ఈ అంశం ఇంకా ఓ కొలిక్కి రాలేదు.