Vitamin D: విటమిన్ డి మోతాదు మించితే ఏం జరుగుతుంది?

Vitamin D Overdose Side Effects Explained
  • ఆరోగ్య పరిరక్షణకు అత్యంత కీలకమైనది విటమిన్ డి
  • ఆహారం ద్వారా విటమిన్ డి అందనప్పుడు ఇంజెక్షన్లతో చికిత్స
  • డోస్ ఎక్కువైతే గుండె సంబంధిత సమస్యలు
ఆరోగ్యానికి అత్యంత కీలకమైనది విటమిన్ డి. చాలామందిలో ఇది లోపించినప్పుడు అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే విటమిన్ డి తక్కువగా ఉన్నప్పుడు లేదా ఆహారం ద్వారా సరిగ్గా అందనప్పుడు డాక్టర్లు విటమిన్ డి ఇంజెక్షన్లు ఇస్తారు. ఇవి సాధారణంగా సురక్షితమే అయినా, కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. 

ఇంజెక్షన్ వేసిన చోట నొప్పి లేదా కొద్దిగా వాపు రావచ్చు. ఇది కాకుండా, కొందరికి వాంతులు, తలనొప్పి, కళ్లు తిరగడం, మలబద్ధకం వంటివి కూడా ఉండొచ్చు. ఇవి సాధారణంగా కనిపించే సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే. అయితే, విటమిన్ డి ఇంజెక్షన్లు ఎక్కువ మోతాదులో లేదా తరచుగా తీసుకుంటే కొన్ని సమస్యలు వస్తాయి. 

ఎక్కువ విటమిన్ డి తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం స్థాయిలు పెరిగిపోతాయి. దీని వల్ల అలసట, గందరగోళం, డీహైడ్రేషన్ (శరీరంలో నీరు తగ్గడం), కిడ్నీలో రాళ్లు మరియు గుండెకు సంబంధించిన సమస్యలు కూడా రావొచ్చు. 

విటమిన్ డి మన ఎముకలకు కాల్షియం అందేలా చేస్తుంది. కానీ, విటమిన్ డి ఎక్కువగా ఉంటే, ఈ కాల్షియం రక్తనాళాలలో (నరాలలో) కూడా పేరుకుపోతుంది. దీన్ని ఆర్టెరియల్ కాల్సిఫికేషన్ అంటారు. దీని వల్ల నరాలు గట్టిపడి, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే, విటమిన్ డి ఇంజెక్షన్లు తీసుకోవాల్సినప్పుడు డాక్టర్ సలహా తప్పనిసరి. 

మీకు గుండె జబ్బులు, కిడ్నీలో రాళ్లు లేదా రక్తంలో కాల్షియం ఎక్కువ ఉన్నట్లయితే, ఇంజెక్షన్లు తీసుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలం లేదా అధిక మోతాదులో ఇంజెక్షన్లు తీసుకుంటే, వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండటం చాలా ముఖ్యం.
Vitamin D
Vitamin D Injection
Vitamin D side effects
Hypercalcemia
Kidney stones
Arterial calcification
Heart disease
Vitamin D dosage
Vitamin D overdose

More Telugu News