Charu Sinha: హెచ్‌సీఏ విషయంలో దుష్ప్రచారం చేయవద్దు: సీఐడీ అధికారిణి చారుసిన్హా

Charu Sinha urges not to misrepresent HCA case
  • ఓటింగ్ విషయంలో ఐఏఎస్, ఐపీఎస్‌లపై ప్రచారం
  • ఖండించిన అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు
  • కేసు సంబంధిత అప్‌డేట్‌లను సీఐడీ అధికారికంగా విడుదల చేస్తుందని వెల్లడి
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కేసు విషయంలో దుష్ప్రచారం చేయవద్దని తెలంగాణ సీఐడీ అడిషనల్ డీజీపీ చారుసిన్హా మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఓటింగ్ విషయంలో ఐఏఎస్, ఐపీఎస్‌లపై అసత్య ప్రచారం చేయవద్దని ఆమె కోరారు. కేసు సంబంధిత సమాచారాన్ని సీఐడీ అధికారికంగా విడుదల చేస్తుందని ఆమె వెల్లడించారు. అసత్య ప్రచారాలు చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.

హెచ్‌సీఏ కేసులో అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈవో సునీల్, అధికారి రాజేందర్ యాదవ్, ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు ఉన్నాయి. వీరంతా 23 ఇన్ స్టిట్యూషనల్ ఓట్లను అక్రమంగా వేయించినట్లు సీఐడీ గుర్తించింది. అయితే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఓటింగులో పాల్గొన్నారన్న ఆరోపణలను చారుసిన్హా ఖండించారు.
Charu Sinha
HCA
Hyderabad Cricket Association
Telangana CID
Crime Investigation Department

More Telugu News