Manchu Lakshmi: నాయుడుపేటలో తల్లి సమాధి వద్ద నివాళులు అర్పించిన మంచు లక్ష్మి

Manchu Lakshmi pays tribute to her late mother in Naidupet
  • తిరుపతి జిల్లా నాయుడుపేట వచ్చిన మంచు లక్ష్మి
  • తల్లి సమాధిని సందర్శించిన వైనం
  • భావోద్వేగాలకు లోనైన మంచు లక్ష్మి
ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి నాయుడుపేటలో తన తల్లి విద్యా దేవి సమాధి వద్ద నివాళులు అర్పించారు. మంచు లక్ష్మి ఇవాళ తిరుపతి జిల్లాలోని నాయుడుపేట వచ్చారు. తల్లి సమాధిని సందర్శించి, ఆమె స్మరించుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. మంచు లక్ష్మి, తన తల్లి సమాధి వద్ద పూలమాలలు వేసి, శ్రద్ధాంజలి ఘటించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "అమ్మ లేని లోటు ఎప్పటికీ తీరనిది. ఆమె జ్ఞాపకాలు నన్ను ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటాయి" అని భావోద్వేగంతో చెప్పారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా పాల్గొన్నారు. మోహన్ బాబు మొదటి భార్య విద్యా దేవి మరణం తర్వాత ఆమె సోదరి నిర్మలా దేవిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. 
Manchu Lakshmi
Mother
Naidupet
Mohan Babu

More Telugu News