Shashi Tharoor: ఆయనకు పార్టీలో ఏం అధికారం ఉంది: సీనియర్ నేత వ్యాఖ్యలపై శశిథరూర్ ఆగ్రహం

Shashi Tharoor Angered by Senior Leaders Comments
  • శశిథరూర్ తీరు మార్చుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతున్నామన్న మురళీధరన్
  • తనపై మాట్లాడేందుకు వారి వద్ద ఉన్న ఆధారాలు ఏమిటన్న శశిథరూర్
  • నేను నా గురించి మాత్రమే మాట్లాడతానని శశిథరూర్ వ్యాఖ్య
పార్టీ కార్యకలాపాలకు తనను దూరం పెడుతున్నారని చెప్పడానికి మురళీధరన్‌కు పార్టీలో ఏం అధికారం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతకాలంగా ఆయన తీరుపై పార్టీ అధిష్ఠానం అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో, పార్టీ కార్యకలాపాలకు శశిథరూర్‌ను దూరం పెడుతున్నామని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత మురళీధరన్ అన్నారు.

మురళీధరన్ వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా శశిథరూర్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వాదనలు చేయడానికి వారి వద్ద ఉన్న ఆధారాలు ఏమిటని నిలదీశారు. తనపై అలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి పార్టీలో ఏం అధికారం ఉందో చెప్పాలని శశిథరూర్ అన్నారు. కొంతమంది ఎలాంటి ఆధారాలు లేకుండానే మాట్లాడుతున్నారని విమర్శించారు. అలాంటి వాటికి స్పందించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. వేరే వాళ్ల గురించి తనను అడగవద్దని, తన గురించి మాత్రమే తాను మాట్లాడతానని శశిథరూర్ స్పష్టం చేశారు.

మురళీధరన్ ఏమన్నారంటే?

పార్టీల ప్రయోజనాల కంటే దేశానికి ప్రాధాన్యం ఇవ్వాలని శశిథరూర్ పలుమార్లు అన్నారు. ఈ వ్యాఖ్యలపై మురళీధరన్ మాట్లాడుతూ, ఆయన తన తీరు మార్చుకునే వరకు తిరువనంతపురంలో నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించబోమని స్పష్టం చేశారు. తమతో కలిసి లేరు కాబట్టి ఆయనను బహిష్కరించే ప్రశ్న ఉత్పన్నం కాదని అన్నారు. శశిథరూర్‌పై ఏం చర్యలు తీసుకోవాలో పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని వ్యాఖ్యానించారు.
Shashi Tharoor
Muralidharan
Congress Party
Kerala Congress
Indian National Congress

More Telugu News