Malayappa Swamy: మలయప్ప స్వామికి మైసూరు సంస్థానం ఆతిథ్యం

Malayappa Swamy Receives Mysore Kingdom Hospitality
  • తిరుమలలో ఘనంగా శ్రీవారి పల్లవోత్సవం
  • కర్ణాటక సత్రం వద్ద స్వామివారికి స్వాగతం పలికిన మైసూర్ సంస్థానం ప్రతినిధులు
  • టీటీడీ చైర్మన్ కు జ్ఞాపికను అందజేసిన మైసూర్ మహారాణి ప్రమోదాదేవి
తిరుమలలో శ్రీవారి పల్లవోత్సవం నిన్న వైభవంగా జరిగింది. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని టీటీడీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేశారు.

అక్కడ మైసూరు సంస్థానం వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు మైసూరు సంస్థాన ప్రతినిధులు ఆహ్వానం పలికి, ప్రత్యేక హారతి సమర్పించారు. అనంతరం టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడును మైసూర్ మహారాణి ప్రమోదాదేవి సత్కరించి, సంస్థానం జ్ఞాపికను అందజేశారు.

ఈ కార్యక్రమంలో మైసూర్ సంస్థానం మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ వడియార్, టీటీడీ బోర్డు సభ్యులు నరేశ్, జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 
Malayappa Swamy
Tirumala
Mysore
TTD
Pallavotsavam
Srivari Pallavotsavam
Karnataka Satram
Pramoda Devi
Yaduveer Krishna Datta Chamaraj Wadiyar

More Telugu News