Mithun Reddy: ఇంటిభోజనం.. కొత్త పరుపు.. జైల్లో ప్రత్యేక వసతుల కోసం మిథున్‌రెడ్డి పిటిషన్లు
- మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి, జైల్లో రిమాండ్ ఖైదీగా ఎంపీ మిథున్ రెడ్డి
- జైల్లో ప్రత్యేక వసతుల కోసం విజయవాడ ఏసీబీ కోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు
- ఇంటిభోజనం.. కొత్త పరుపు.. దిండ్లు.. మంచం.. కిన్లే వాటర్ బాటిళ్లు కావాలన్న ఎంపీ
- వీటితో పాటు యోగా మ్యాట్, ప్రొటీన్ పౌడర్ ఇప్పించాలని కోరిన మిథున్ రెడ్డి
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి, జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కారాగారంలో తనకు ప్రత్యేక వసతులు కల్పించాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వాటిలో అల్పాహారం సహా మూడు పూటల ఇంటి భోజనం, కిన్లే వాటర్ బాటిళ్లు, కొత్త పరుపుతో కూడిన మంచం, కొత్త దిండ్లు, వెస్ట్రన్ కమోడ్ కలిగిన ప్రత్యేక గది, అందులో ఓ టీవీ, సేవలు అందించేందుకు ఓ సహాయకుడు, దినపత్రికలు, వాకింగ్ షూలు, దోమ తెర కావాలని అడిగారు.
వీటితో పాటు యోగా మ్యాట్, ప్రొటీన్ పౌడర్, గదిలో ఓ టేబుల్, దానిపై తెల్లకాగితాలు, పెన్ను ఇప్పించాలని కోరారు. ఆయన పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టు నిన్న విచారణ జరిపింది. వాటిపై అభ్యంతరాలు ఉంటే చెప్పాలని రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ సూపరింటెండెన్‌ను ఆదేశించింది. ఈ రోజు ఉదయం నేరుగా కోర్టులో హాజరై అభ్యంతరాలు చెప్పాలని సూచించింది.