Pawan Kalyan: ఆ ఫ్లాప్ ఇవ్వడమే నేను చేసిన పాపం: పవన్ కల్యాణ్

Pawan Kalyan says giving a flop was his mistake
  • ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లు అయిందన్న పవన్ కల్యాణ్
  • వయసు పెరిగిందేమో కానీ గుండెల్లో చేవ మాత్రం చావలేదన్న పవన్ 
  • కష్టాల్లో ఉన్న సమయంలో తనతో జల్సా మూవీ చేసి త్రివిక్రమ్ మంచి హిట్ ఇచ్చాడన్న పవన్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన పాన్ ఇండియా మూవీ హరి హర వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుక నిన్న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ తన సినీ ప్రస్థానం గురించి మాట్లాడుతూ, అప్పట్లో తాను చేసిన పాపం ఒక్క ఫ్లాప్ ఇవ్వడమేనని అన్నారు.

ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 30 ఏళ్లు అవుతుందని ఆయన అన్నారు. వయసు పెరిగిందేమో కానీ గుండెల్లో చేవ మాత్రం చావలేదని అన్నారు. గబ్బర్ సింగ్ సినిమా సమయంలో ఒక హిట్ ఇవ్వమని ఓ అభిమాని అడిగాడని, అది హరిశంకర్ వల్ల తిరిగి వచ్చిందన్నారు. ఆ సినిమా కూడా చాలా క్లిష్టమైన సమయంలో చేశానన్నారు.

జానీ సినిమా ఫెయిల్ అయినా అభిమానులు వదల్లేదన్నారు. కానీ అన్ని బంధాలు కూడా డబ్బుతో ముడిపడి ఉంటాయని, అందుకే నాడు రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేశానని చెప్పారు. తానెప్పుడూ డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వలేదని, బంధాలకు ప్రాధాన్యత ఇచ్చానని పేర్కొన్నారు. తనకు ప్రధాని నుంచి అందరూ తెలుసు కానీ దాని వల్ల డబ్బులు రావు కదా అని అన్నారు. అందుకే డబ్బులు రావడానికి, మిమ్మల్ని ఆనందింపజేయాలనే ఈ మూవీ చేశానని అన్నారు.

ఎప్పుడూ రీమేక్‌లు చేస్తావంటూ అందరూ తనను తిట్టేవారని, మనకేమీ పెద్దపెద్ద దర్శకులు ఎవరూ లేరని అన్నారు. నాడు తాను చేసిన పాపం ఒక్క ఫ్లాప్ ఇవ్వడమేనని, మళ్లీ సినిమాపై గ్రిప్ దొరకలేదన్నారు. ఆ సమయంలో తనకు అండగా నిలబడిన వ్యక్తి త్రివిక్రమ్ అని గుర్తు చేసుకున్నారు. కష్టాల్లో ఉన్న తనతో జల్సా మూవీ చేసి మంచి హిట్ ఇచ్చాడని చెప్పుకొచ్చారు. 
Pawan Kalyan
Hari Hara Veera Mallu
Telugu movies
Harish Shankar
Jalsa movie
Trivikram Srinivas
Gabbar Singh
Johnny movie
Tollywood
Shilpakala Vedika

More Telugu News