Gopal Yadav: రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్ బీఆర్ఎస్ కు రాజీనామా

Gopal Yadav Resigns from BRS Party in Major Setback
  • మహబూబ్ నగర్ జిల్లా మాజీ అధ్యక్షుడి రాజీనామా
  • 2020లో రైతుబంధు సమితి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన గోపాల్ యాదవ్
  • 'స్థానిక' ఎన్నికలకు ముందు పార్టీకి రాజీనామా
తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రైతుబంధు సమితి మహబూబ్ నగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్ పార్టీకి రాజీనామా చేశారు. 2018లో గోపాల్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీలో చేరగా, 2020లో రైతుబంధు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

గోపాల్ యాదవ్ తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్‌‍తో ప్రారంభించారు. 1975లో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ, పలుమార్లు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. అనంతరం బీఆర్ఎస్‌లో చేరిన గోపాల్ యాదవ్, తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్లి 2018లో మళ్లీ బీఆర్ఎస్‌లో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గోపాల్ యాదవ్ బీఆర్ఎస్‌ను వీడటం చర్చనీయాంశంగా మారింది.


Gopal Yadav
BRS party
Rythu Bandhu Samithi
Telangana politics
Gellu Srinivas Yadav
Banakacherla project

More Telugu News