కూరగాయలు, చికెన్ తింటూ.. 17 కిలోల బరువు తగ్గిన సర్ఫరాజ్ ఖాన్
- రెండు నెలల కాలంలో 95 కిలోల నుండి 78 కిలోలకు తగ్గిన సర్ఫరాజ్
- జిమ్‌లో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమంలో పంచుకున్న క్రికెటర్
- సర్ఫరాజ్ ఖాన్ సన్నబడటంపై నెటిజన్ల ఆశ్చర్యం
గతంలో 95 కిలోల బరువున్న సర్ఫరాజ్ ఖాన్, ప్రస్తుతం 78 కిలోలకు తగ్గినట్లు తెలుస్తోంది. బరువు తగ్గిన తర్వాత జిమ్‌లో దిగిన ఒక ఫొటోను అతడు సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ ఇంతగా సన్నబడ్డాడా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.