Donald Trump: అక్రమ వలసదారులను బయటకు ఈడ్చేయాలి.. ట్రంప్ హెచ్చరిక

Trump Calls for Deportation After Illegal Immigrant Shoots CBP Officer
  • సీబీపీ అధికారిపై అక్రమ వలసదారుడి కాల్పులు
  • ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన డొనాల్డ్ ట్రంప్
  • జోబైడెన్ పాలనలో దేశాన్ని అక్రమ వలసదారులతో నింపేశారని ఆగ్రహం
  • వారందరినీ ఇప్పుడు సరిహద్దు బయటకు విసిరేస్తామన్న అధ్యక్షుడు
యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) అధికారిపై అక్రమ వలసదారుడు కాల్పులు జరిపిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. అక్రమ వలసదారులను సరిహద్దు బయటకు విసిరేస్తామని చెప్పారు. దాడిచేసిన వ్యక్తిని 2023 ఏప్రిల్‌లో పట్టుకున్నప్పటికీ బహిష్కరించకుండా విడుదల చేశారని విమర్శించారు.

కాల్పుల ఘటనపై ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. "జో బైడెన్ పాలనలో విడుదలైన ఒక అక్రమ వలసదారుడు నిన్న రాత్రి న్యూయార్క్‌లో సీబీపీ అధికారిపై కాల్పులు జరిపాడు. అతడిని 2023 ఏప్రిల్‌లో సరిహద్దు వద్ద పట్టుకున్నారు. కానీ బహిష్కరించకుండా విడుదల చేశారు. కాల్పుల్లో సీబీపీ అధికారి గాయపడినప్పటికీ దాడి చేసిన వ్యక్తితో ధైర్యంగా పోరాడారు. ధైర్యాన్ని ప్రదర్శించాడు. డెమోక్రాట్లు మన దేశాన్ని నేరస్థుల ఆక్రమణలతో నింపారు. ఇప్పుడు వారందరినీ బయటకు విసిరివేయాలి, లేదా కేసులు నమోదు చేయాలి, ఎందుకంటే వారు మళ్లీ తిరిగి వచ్చే అవకాశం ఇవ్వకూడదు. వారు చాలా ప్రమాదకరమైన వారు’’అని ట్రంప్ ఆ పోస్టులో పేర్కొన్నారు.

న్యూయార్క్ పోలీస్ కమిషనర్ జెస్సికా టిష్ కథనం ప్రకారం.. ఈ ఘటన శనివారం రాత్రి 11:50 గంటల సమయంలో ఫోర్ట్ వాషింగ్టన్ పార్క్‌లో జరిగింది. 42 ఏళ్ల ఫెడరల్ ఏజెంట్ ఒక మహిళతో కలిసి హడ్సన్ నది ఒడ్డున ఒక రాతిపై కూర్చొని ఉండగా ఇద్దరు వ్యక్తులు మోపెడ్‌పై వచ్చారు. ఒక వ్యక్తి దిగి అధికారి వద్దకు వచ్చాడు. అతడు దోపిడీకి గురవుతున్నట్టు గ్రహించి వెంటనే తన సర్వీస్ వెపన్‌ను బయటకు తీశాడు. ఇద్దరూ కాల్పులు జరిపారు. అధికారి ముఖం, ఎడమ చేతికి గాయాలయ్యాయి. దాడిచేసిన వ్యక్తి కూడా గాయపడ్డాడు. తర్వాత నిందితులిద్దరూ పారిపోయారు.

పారిపోయిన వారిలో ఒకరిని 21 ఏళ్ల అక్రమ వలసదారుడు మిగ్యూల్ మోరాగా గుర్తించారు. అతడు తొడ, కాలికి గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. అక్కడ అతడిని అదుపులోకి తీసుకున్నారు. గృహ హింస కేసులో మోరా న్యూయార్క్‌లో ఇప్పటికే రెండుసార్లు అరెస్ట్ అయ్యాడు. మసాచుసెట్స్‌లో దొంగిలించిన ఆయుధాల కేసులో వాంటెడ్‌గా ఉన్నాడు. అతడితో పాటు వచ్చిన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
Donald Trump
Illegal immigrants
US Customs and Border Protection
CBP
Joe Biden
New York
Crime
Immigration
Migrant crime
Border security

More Telugu News