Balasore suicide case: తన ఫిర్యాదును పట్టించుకోకపోవడం వల్లే ఆ విద్యార్థిని నిప్పంటించుకుంది: పోలీసులు
- ఒడిశాలోని బాలాసోర్‌లో ఓ ప్రైవేటు కళాశాలలో ఘటన
- అంతర్గత కమిటీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే విద్యార్థిని ఆత్మాహుతి
- సాక్షుల వాంగ్మూలాల్లో తేడాలు ఉన్నాయన్న క్రైంబ్రాంచ్ పోలీసులు
ఒడిశాలోని బాలాసోర్‌లో ప్రైవేటు కాలేజీ విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాన్ని క్రైం బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. లైంగిక వేధింపులపై తానిచ్చిన ఫిర్యాదును కళాశాల అంతర్గత విచారణ కమిటీ పట్టించుకోకపోవడం వల్లే ఆమె ఆత్మాహుతికి పాల్పడిందని పోలీసులు వివరించారు.
20 ఏళ్ల బాధితురాలు ఫకీర్ మోహన్ అటానమస్ కాలేజీలో బీఈడీ చదువుతోంది. భువనేశ్వర్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తాజాగా మృతి చెందింది. ఈ కేసులో సాక్షుల వాంగ్మూలాల్లో తేడాలు ఉన్నాయని క్రైం బ్రాంచ్ డీజీ వినయ్‌తోష్ మిశ్రా తెలిపారు.
‘‘విద్యార్థిని ఫిర్యాదుపై కాలేజీ అధికారులు చర్యలు తీసుకున్నారు. అంతర్గత విచారణ కమిటీ వేశారు. అయితే, ఆ కమిటీ విద్యార్థిని ఫిర్యాదును పట్టించుకోలేదు. తన ఫిర్యాదు చెల్లుబాటు కాకపోవడంతో విద్యార్థిని తీవ్ర నిర్ణయం తీసుకుంది’’ అని నిన్న బాలాసోర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మిశ్రా వివరించారు.
సోషల్ మీడియాలో, కమిటీ ముందు, పోలీసులకు ప్రజలు ఇచ్చిన వాంగ్మూలాల్లో వైరుధ్యాలు ఉన్నాయని మిశ్రా పేర్కొన్నారు. ఈ విషయంలో సరైన నిర్ణయానికి రావాలంటే ప్రతి వాంగ్మూలాన్ని క్షుణ్ణంగా విశ్లేషించడం అవసరమని ఆయన వివరించారు.
క్రైం బ్రాంచ్‌కు చెందిన ఉమెన్ అండ్ చిల్డ్రన్ వింగ్ (సీఏడబ్ల్యూఅండ్ సీడబ్ల్యూ) విభాగం యువతి లైంగిక ఆరోపణలపై దర్యాప్తు చేస్తోంది. ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించి 90 శాతం కాలిన గాయాలతో మరణించిన ఐదు రోజుల తర్వాత ఈ నెల 17న క్రైం బ్రాంచ్ దర్యాప్తు చేపట్టింది.
ఆమె ఫిర్యాదు చేసిందని, ఆ తర్వాత కళాశాల అధికారులు ఒక కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారని మిశ్రా అన్నారు. ఆ కమిటీ దాదాపు 89-90 మంది వాంగ్మూలాలను నమోదు చేసిందని తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత ఆమె ప్రిన్సిపాల్ వద్దకు వెళ్లిందని, ఆ తర్వాత ఏం జరిగిందో స్పష్టంగా లేదని డీజీ మిశ్రా వివరించారు.