బీజేపీ హైకమాండ్ చెబితే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తా: రాజాసింగ్
- పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న రాజాసింగ్
- ఇటీవలే బీజేపీకి రాజీనామా
- ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వైనం
ఇవాళ బోనాల సందర్భంగా నగరంలోని సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న రాజాసింగ్, అనంతరం మీడియాతో మాట్లాడారు. గోషామహల్ అంటే బీజేపీ అడ్డా అని, ఇక్కడ ఉప ఎన్నిక వచ్చినా తనకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. ఎవరు పోటీ చేసినా తానేమీ బాధపడనని స్పష్టం చేశారు. అంతేగాకుండా, తాను ఏ పార్టీలోకి వెళ్లనని అన్నారు.