Anirudh Ravichander: అనిరుధ్ రవిచందర్ సంగీత కచేరీ వాయిదా... కారణం ఇదే!

Anirudh Ravichanders Concert Postponed Due to Overwhelming Demand
  • ఈ నెల 26న చెన్నైలో 'హుకుం' కాన్సర్ట్
  • టికెట్ల కోసం అనూహ్య స్పందన
  • ప్రస్తుత వేదికలో పరిమిత సామర్థ్యం కారణంగా వాయిదా వేస్తున్నామన్న అనిరుధ్
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ 'హుకుం' వరల్డ్ టూర్‌లో భాగంగా జూలై 26న చెన్నైలోని తిరువిదంతైలో జరగాల్సిన 'హుకుం చెన్నై' కాన్సర్ట్ వాయిదా పడినట్లు ఆదివారం ప్రకటించారు. టిక్కెట్లకు భారీ డిమాండ్ ఏర్పడిందని, ప్రస్తుత వేదికలో పరిమిత సామర్థ్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనిరుధ్ తెలిపారు.

ఈ సందర్భంగా అనిరుద్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక ప్రకటన విడుదల చేస్తూ, "టికెట్ల కోసం అభిమానుల నుంచి అంచనాలకు మించి స్పందన వస్తోంది. ఈ కారణంగా జూలై 26న తిరువిదంతైలో జరగాల్సిన హుకుం చెన్నై కాన్సర్ట్‌ను వాయిదా వేస్తున్నాము. మీ ప్రేమకు, ఓపికకు ధన్యవాదాలు. త్వరలో మరింత విశాలమైన వేదికతో, మరింత ఘనంగా తిరిగి వస్తాం!" అని పేర్కొన్నారు. 

టిక్కెట్ కొనుగోలు చేసిన వారికి 7 నుంచి 10 రోజుల్లో రీఫండ్‌లు జమ చేస్తామని ఆయన తెలిపారు. కొత్త తేదీ మరియు వేదిక వివరాలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. 
Anirudh Ravichander
Hukum Chennai
Anirudh concert
Hukum World Tour
Chennai concert postponed
Tamil music
Indian music concert
Thiruvidanthai

More Telugu News