Dulquer Salmaan: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దుల్కర్ సల్మాన్

Dulquer Salmaan Meets CM Revanth Reddy
  • జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసంలో మర్యాదపూర్వక భేటీ
  • దుల్కర్ వెంట నిర్మాతలు స్వప్న దత్, చెరుకూరి సుధాకర్
  • దుల్కర్ కు శాలువా కప్పిన రేవంత్ రెడ్డి
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, నిర్మాతలు స్వప్న దత్, చెరుకూరి సుధాకర్ ఆదివారం (జులై 20) నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దుల్కర్ సల్మాన్‌ను శాలువా కప్పి సత్కరించారు. అనంతరం కాసేపు ముచ్చటించుకున్నారు. 

దుల్కర్ సల్మాన్ తెలుగు చిత్ర పరిశ్రమలో 'మహానటి', 'సీతారామం', 'లక్కీ భాస్కర్' వంటి స్ట్రయిట్ చిత్రాలతో గుర్తింపు పొందారు. ఇందులో మహానటి, సీతారామం స్వప్న దత్ నిర్మాతగా వైజయంతీ మూవీస్ బ్యానర్ పైనే వచ్చాయి.

ప్రస్తుతం దుల్కర్ 'కాంత', ఆకాశంలో ఒక తార అనే చిత్రాల్లో నటిస్తున్నారు. కాంత చిత్రాన్ని రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. 
Dulquer Salmaan
Revanth Reddy
Telangana CM
Swapna Dutt
Lucky Bhaskar
Mahanati
Seetha Ramam
Telugu Cinema
Kanttha
Spirit Media

More Telugu News