Mithun Reddy: జగన్ తో క్లోజ్ గా ఉంటున్నాడనే మిథున్ ను జైలుకు పంపారు: పెద్దిరెడ్డి

Mithun Reddy Arrested Due to Closeness with Jagan Says Peddireddy
  • ఏపీ లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి అరెస్ట్
  • తీవ్రస్థాయిలో స్పందించిన పెద్దిరెడ్డి 
  • చంద్రబాబు ఫలితం అనుభవిస్తాడని హెచ్చరిక
ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ అధికారులు నిన్న తన కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం పట్ల వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. జగన్ తో సన్నిహితంగా ఉంటున్నాడనే మిథున్ రెడ్డిపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ కలిసి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 

"జిల్లాలో మా కుటుంబానికి ఉన్న పట్టు చూసి చంద్రబాబు తట్టుకోలేక ఇలా విద్వేషం ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు తప్పక ఫలితం అనుభవిస్తారు. ఇలాంటి నియంతలు ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు. గతంలోనూ, ఎయిర్ పోర్ట్ మేనేజర్ ను కొట్టాడని మిథున్ పై కేసు పెట్టారు. ఆ తర్వాత అది తప్పుడు కేసు అని తేలింది. మదనపల్లె ఫైల్స్ అన్నారు... అది ఏమీ తేల్చలేకపోయారు. ప్రభుత్వ భూములు, అటవీ భూములు ఆక్రమించాం అన్నారు... ఇప్పుడు లిక్కర్ స్కాంలో పాత్ర ఉందంటూ అరెస్ట్ చేశారు. ఇందులోనూ మిథున్ కడిగిన ముత్యంలా బయటికి వస్తాడు. మిథున్ తప్పుచేయలేదు కాబట్టి బయపడాల్సిన పనిలేదు" అని అన్నారు. 
Mithun Reddy
Peddireddy Ramachandra Reddy
Andhra Pradesh
AP Liquor Scam
Chandrababu Naidu
Pawan Kalyan
Nara Lokesh
YSRCP
Political Vendetta

More Telugu News