AM Ratnam: హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నంపై డిస్ట్రిబ్యూటర్ల ఫిర్యాదు

Distributors File Complaint Against AM Ratnam Regarding Past Dues
  • తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో ఏఎం రత్నంపై రెండు ఫిర్యాదులు
  • గత చిత్రాల బకాయిలు చెల్లించలేదని ఆరోపణ
  • ప్రస్తుతం హరిహర వీరమల్లు చిత్ర నిర్మాతగా ఉన్న ఏఎం రత్నం
ప్రముఖ సినీ నిర్మాత ఏఎం రత్నంపై తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టీఎఫ్‌సీసీ)లో ఫిర్యాదు అందింది. ‘హరిహర వీరమల్లు’ సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఏఎం రత్నం, తన గత చిత్రాలైన ‘ఆక్సిజన్‌’, ‘బంగారం’, ‘ముద్దుల కొడుకు’ సినిమాలకు సంబంధించిన బకాయిలను చెల్లించలేదని రెండు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఆరోపించాయి. 

ఎంఎస్‌ ఏషియన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ ‘ఆక్సిజన్‌’ సినిమా కోసం ఇచ్చిన 2.6 కోట్ల రూపాయల అడ్వాన్స్‌ను తిరిగి చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఫిర్యాదు చేసింది. అలాగే, మహాలక్ష్మీ ఫిల్మ్స్‌ సంస్థ కూడా బకాయిల చెల్లింపు కోసం టీఎఫ్‌సీసీని ఆశ్రయించింది. దీనిపై నిర్మాత ఏఎం రత్నం స్పందించాల్సి ఉంది. 

ప్రస్తుతం ఏఎం రత్నం నిర్మాతగా పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ భారీ చిత్రం జులై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
AM Ratnam
Hari Hara Veera Mallu
Pawan Kalyan
Oxygen Movie
Telangana Film Chamber of Commerce
Movie Distributors
Telugu Cinema
MS Asian Enterprises
Mahalakshmi Films
Film Industry

More Telugu News