Al-Waleed bin Khalid Al Saud: 20 ఏళ్లుగా కోమాలో ఉన్న సౌదీ 'స్లీపింగ్ ప్రిన్స్' మృతి

Saudi Arabias Sleeping Prince dies after 20 years in coma
  • ప్రిన్స్ అల్ వలీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ మృతి
  • దాదాపు 20ఏళ్లుగా కోమాలో ఉన్న ఆయ‌న‌ 36 సంవత్సరాల వయసులో మరణం
  • అల్ వలీద్ బిన్ ఖలీద్ మరణాన్ని ధ్రువీకరించిన ఆయ‌న‌ కుటుంబం
సౌదీ అరేబియా 'స్లీపింగ్ ప్రిన్స్' అని పిలువబడే ప్రిన్స్ అల్ వలీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ మృతిచెందారు. దాదాపు రెండు దశాబ్దాలు కోమాలో ఉన్న ఆయ‌న‌ 36 సంవత్సరాల వయసులో మరణించారు. అల్ వలీద్ బిన్ ఖలీద్ మరణాన్ని ఆయ‌న‌ కుటుంబం ధ్రువీకరించింది.

"అల్లాహ్ ఆజ్ఞ.. తీవ్ర విచారం, దుఃఖంతో నిండిన హృదయాలతో మేము మా ప్రియమైన కుమారుడు ప్రిన్స్ అల్-వలీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ బిన్ అబ్దులాజీజ్ అల్ సౌద్ ఈరోజు మరణించాడ‌ని తెలియ‌జేస్తున్నాం. అతనిని అల్లాహ్ కరుణించుగాక" అని అతని తండ్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ తలాల్ బిన్ అబ్దులాజీజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

రియాద్‌లోని ఇమామ్ తుర్కి బిన్ అబ్దుల్లా మసీదులో అసర్ ప్రార్థన తర్వాత ఆదివారం అంత్యక్రియల ప్రార్థనలు జరగనున్నాయని కుటుంబం ప్రకటించింది. కాగా, లండన్‌లో జరిగిన ఓ కారు ప్రమాదం తరువాత ప్రిన్స్ అల్-వలీద్ బిన్ ఖలీద్ 2005లో 15 సంవత్సరాల వయసులోనే కోమాలోకి వెళ్లారు. ఆయనను రియాద్‌లోని కింగ్ అబ్దులాజీజ్ మెడికల్ సిటీలో చేర్చారు. దాదాపు 20 ఏళ్లుగా వెంటిలేటర్‌పైనే ఉన్నారు.
Al-Waleed bin Khalid Al Saud
Sleeping Prince
Saudi Arabia
Prince Al-Waleed death
Saudi Prince dies
coma death
King Abdulaziz Medical City
Riyadh
car accident

More Telugu News