SpiceJet: శంషాబాద్ - తిరుపతి ఫ్లైట్‌లో సాంకేతిక లోపం .. సర్వీస్‌ను రద్దు చేసిన స్పైస్ జెట్ ఎయిర్ వేస్

SpiceJet flight to Tirupati cancelled due to technical issues
  • రన్ వే పై వెళ్తుండగా సాంకేతిక లోపం గుర్తించిన పైలట్
  • అధికారులకు సమాచారం ఇచ్చిన పైలట్ 
  • మరో విమానంలో ప్రయాణికులను పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
శంషాబాద్ నుండి తిరుపతికి బయలుదేరాల్సిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆ విమాన సర్వీసును రద్దు చేశారు. తిరుపతికి వెళ్లాల్సిన స్పైస్ జెట్ ఎస్జీ - 2138 విమానం రన్ వేపై వెళ్తుండగా పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. వెంటనే పైలట్ సంబంధిత అధికారులకు సమాచారం అందించారు.

దీంతో తిరుపతికి వెళ్లాల్సిన ఈ విమానాన్ని రద్దు చేస్తున్నట్లు స్పైస్ జెట్ ఎయిర్ వేస్ అధికారులు ప్రకటించారు. ఈ విమానంలో తిరుపతికి వెళ్లాల్సిన 54 మంది ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరో విమానంలో పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 
SpiceJet
SpiceJet airlines
Shamshabad airport
Tirupati flight
flight cancellation
technical issue
SG 2138
airline service

More Telugu News