పహల్గామ్ ఉగ్రదాడి వాళ్లే చేశారనడానికి ఆధారాలు ఏవి?: పాక్ మంత్రి వ్యాఖ్యలు
- ఏప్రిల్ 22న పహల్గామ్ లో ఉగ్రదాడి
- ఈ దాడిలో టీఆర్ఎఫ్ కు సంబంధం లేదంటున్న పాక్ విదేశాంగ మంత్రి దార్
- ఇది చట్టవిరుద్ధ సంస్థ కాదని వెల్లడి
- ఇప్పటికే టీఆర్ఎఫ్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా
- అయినప్పటికీ నిస్సిగ్గుగా పార్లమెంటులో ప్రకటన చేసిన దార్
దార్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంలో వివాదాస్పదంగా మారాయి. ఎందుకంటే టీఆర్ఎఫ్‌ను అమెరికా తాజాగా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఈ దాడిలో 26 మంది పౌరులు మరణించారు. ఈ దాడికి తమదే బాధ్యత అని లష్కరే తోయిబా ముసుగు సంస్థ టీఆర్ఎఫ్ ప్రకటించుకుంది. అయినప్పటికీ, దార్ తమపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. ఐరాస భద్రతామండలి (యూఎన్ఎస్సీ) ఖండన ప్రకటనలో టీఆర్ఎఫ్ పేరును తొలగించడానికి పాకిస్తాన్, తమ నాన్-పర్మినెంట్ సభ్యత్వాన్ని ఉపయోగించిందని వెల్లడించారు. "మేము టీఆర్ఎఫ్‌ను చట్టవిరుద్ధంగా భావించడం లేదు. పహల్గామ్ దాడిని వారు చేపట్టారని ఆధారాలు చూపండి" అని దార్ అన్నారు.