Sonu Sood: పామును చేత్తో పట్టుకున్న నటుడు సోనూసూద్

Sonu Sood Catches Snake with Bare Hands
  • తమ సొసైటీలోకి వచ్చిన పామును స్వయంగా పట్టుకున్న సోనూసూద్
  • తాను పట్టుకున్నది విషపూరిత స్నేక్ కాదని, జెర్రిపోతు అని వెల్లడి
  • వీడియోను 'ఎక్స్' వేదికగా పంచుకున్న సోనూసూద్
ప్రముఖ నటుడు సోనూ సూద్ తాను నివసించే సొసైటీ ఆవరణలో కనిపించిన పామును తన చేతులతో పట్టుకున్నారు. నటుడిగానే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా, పామును చేత్తో పట్టుకొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసి రియల్ హీరో అనిపించుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

అది ర్యాట్ స్నేక్ (జెర్రిపోతు) అని, అది విషపూరితమైనది కాదని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో పాముల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాములు ఇళ్లలోకి ప్రవేశించినప్పుడు వాటిని పట్టుకునేందుకు నిపుణులను మాత్రమే పిలిపించాలని స్పష్టం చేశారు. అనంతరం వాటిని సురక్షితమైన ప్రాంతాల్లో వదిలిపెట్టాలని సూచించారు.
Sonu Sood
Sonu Sood snake
rat snake
snake rescue
Mumbai society
animal rescue

More Telugu News