A K Singh: తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఏకే సింగ్ ప్రమాణస్వీకారం

A K Singh Sworn in as Telangana High Court Chief Justice
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ (ఏకే సింగ్) ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, సీఎం రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్, పలువురు మంత్రులు హాజరయ్యారు. ఇప్పటి వరకు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ లుగా ఆరుగురు పనిచేశారు. జస్టిస్ ఏకే సింగ్ ఏడో చీఫ్ జస్టిస్. 
Go Back to Shorts
A K Singh
Telangana High Court
Chief Justice
A K Singh Swearing In
Telangana
Revanth Reddy
Telangana Judges
Telangana News

More Telugu News