Samantha Perfume: లగ్జరీ పెర్ఫ్యూమ్ తీసుకొస్తున్న సమంత!

Samantha Ruth Prabhu to Launch Luxury Perfume Business
––
టాలీవుడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కొత్త వ్యాపారం ప్రారంభించే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమాలు, వెబ్ సిరీస్ లలో బిజీబిజీగా ఉన్నప్పటికీ కొత్త వ్యాపారంలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమచారం. ఇప్పటికే ఓ ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించిన సమంత.. తాజాగా పెర్ఫ్యూమ్ రంగంలోకి అడుగుపెట్టనుంది. లగ్జరీ పెర్ఫ్యూమ్ ను మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

పెర్ఫ్యూమ్ కంపెనీ పెట్టి తనే అంబాసిడర్ గా ప్రచారం చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఈ ప్రోడక్ట్ విషయంలో సమంత భారీ స్థాయిలో ఖర్చుపెడుతున్నారని తెలుస్తోంది. హీరోయిన్ గా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా కూడా సమంత దూసుకు వెళ్తున్నారు. ఈ కొత్త వ్యాపారంలోనూ సమంత విజయం సాధించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
Samantha Perfume
Luxury Perfume
Perfume Business
Samantha Ruth Prabhu
Samantha
Samantha Business
Tollywood Actress
Indian Actress

More Telugu News