Pakistan: భార‌త‌ ఎయిర్‌లైన్స్‌పై నిషేధాన్ని పొడిగించిన పాకిస్థాన్

Pakistan extends airspace ban on Indian flights till August 24
షార్ట్స్‌లో చూడండి
పాకిస్థాన్ తన గగనతలాన్ని ఉపయోగించి భారత్‌ నడిపే విమానాలపై నిషేధాన్ని పొడిగించింది. ఆగస్టు 24 వరకు భార‌త‌ ఎయిర్‌లైన్స్‌పై బ్యాన్‌ను పొడిగించినట్లు పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ (పీఏఏ) తాజాగా ప్రకటించింది. ఈ నిషేధం భార‌త సైనిక‌, పౌర విమానాల‌న్నింటికీ వ‌ర్తిస్తుంద‌ని తెలిపింది. 

శుక్రవారం జారీ చేసిన నోటామ్ (ఎయిర్‌మెన్‌కు నోటీసు) మధ్యాహ్నం 3:50 గంటలకు అమల్లోకి వచ్చింది. ఈ కొత్త నిషేధం ఆగస్టు 24 ఉదయం 5:19 గంటల వరకు అమలులో ఉంటుంది.

కొనసాగుతున్న పరస్పర గగనతల ఆంక్షలు 
అటు ఈ నెల‌ 24 వరకు పాకిస్థాన్ విమానాలకు భారత్‌ తన గగనతలాన్ని మూసివేసింది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో ఇండియా మొదట ఏప్రిల్ 30న ఈ ఆంక్షలను విధించింది. ఆ త‌ర్వాత ఈ బ్యాన్‌ను జులై 24 వ‌ర‌కు పొడిగించింది. ఈ గ‌డువును ఇప్పుడు మ‌ళ్లీ పొడిగించే అవ‌కాశం ఉంది. 
Go Back to Shorts
Pakistan
India flight ban
Pakistan flight ban extension
Indian airlines
Pakistan airspace
NOTAM
Aviation
Indo-Pak relations
Air travel

More Telugu News