Anasuya Bharadwaj: పెళ్లయ్యాక వాళ్ల విలువ తెలిసింది: అనసూయ

Anasuya Emotional About Family After Marriage
  • వ్యక్తిగత, వృత్తి జీవితంపై మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన అనసూయ 
  • బీహార్ వ్యక్తిని ప్రేమించి మరీ వివాహం చేసుకున్నానన్న అనసూయ
  • పెళ్లి చేసుకుని అమ్మా, నాన్నలకు దూరం అయ్యాక వాళ్ల విలువ తెలిసిందన్న అనసూయ
ప్రముఖ యాంకర్, నటి అనసూయ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవల హైదరాబాద్‌లో అభిమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అనసూయ తన వ్యక్తిగత, వృత్తి జీవిత విషయాలను పంచుకున్నారు. తన కుటుంబం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నదని చెప్పారు.

ప్రతి ఒక్కరికీ సమస్యలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తున్నానని, ఎక్కడికి కావాలంటే అక్కడకు వెళుతున్నానని చెప్పారు. పెద్ద కారు, బంగ్లా ఇవన్నీ అభిమానుల ఆదరణ ద్వారా దక్కాయని చెప్పుకొచ్చారు. తన జీవితంలో టర్నింగ్ పాయింట్ ప్రేమ వివాహమని చెప్పారు.

తెలుగు సినిమాల్లో ఎక్కువగా బీహార్ వాళ్లు విలన్లుగా కనిపిస్తుంటారని, కానీ తాను మాత్రం బీహార్ వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్నట్టు తెలిపారు. తన భర్త ప్రతి విషయంలోనూ మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. అయితే, వివాహం అయి, తల్లిదండ్రులకు దూరం అయిన తర్వాత వాళ్ల విలువ తనకు తెలిసిందని అనసూయ పేర్కొన్నారు. 
Anasuya Bharadwaj
Anasuya
Anchor Anasuya
Telugu Actress
Personal Life
Love Marriage
Family Support
Husband
Parents Value

More Telugu News