KTR: నేను మంచివాడిని కాదు.. అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం!: కేటీఆర్ హెచ్చరిక

KTR Warns Congress Vows Revenge After BRS Workers Attacked
  • బీఆర్ఎస్ వారిని వేధిస్తున్న వారికి కేటీఆర్ హెచ్చరిక
  • వేధించే వారి పేరును రాసి పెట్టుకోవాలని పార్టీ నాయకులకు సూచన
  • కేసీఆర్ చెప్పినా వినేది లేదన్న కేటీఆర్
"బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్న ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. నేను మంచివాడిని కాను. మేం తిరిగి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ చెప్పినా వినేది లేదు. వేధించే ప్రతి ఒక్కరి పేరును మా నాయకులు రాసి పెట్టుకోవాలి. అందరి పేర్లను రాసి పెట్టుకొని అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం" అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఇటీవల మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన పార్టీ నాయకులను కేటీఆర్ శుక్రవారం పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏసీపీలు, డీసీపీలు, సీఐలు, ఎస్సైలు ఎవరైనా సరే, మన వారిని వేధిస్తున్న వారి పేర్లు రాసి ఉంచుకోవాలని కేటీఆర్ సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దని అన్నారు.

ఈ నెల 15న మల్కాజ్‌గిరి ఆషాడ మాస బోనాల చెక్కుల పంపిణీ సందర్భంగా అల్వాల్‌లో కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఘర్షణ జరిగింది. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరు కాగా, బీఆర్ఎస్ వారికి సీట్లు లేకుండా కాంగ్రెస్ వారే కూర్చోవడంతో గొడవ రాజుకుంది. ఇది తీవ్ర రూపం దాల్చి కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలపై దాడి చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
KTR
K Taraka Rama Rao
BRS Party
Telangana Politics
Malkajgiri
Congress BRS Clash

More Telugu News