ప్రముఖ తమిళ దర్శక నటుడు కన్నుమూత
- అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన వేలు ప్రభాకరన్
- ఆయన వయసు 68 సంవత్సరాలు
- 2017లో రెండో పెళ్లి చేసుకున్న ప్రభాకరన్
1980లో వచ్చిన 'ఇవర్గళ్ విత్యసామానవర్గళ్' చిత్రం ద్వారా సినిమాటోగ్రాఫర్ గా పరిచయమయ్యారు. 'నాలయ మనిదన్' సినిమాతో దర్శకుడిగా మారారు. తన సినిమాల ద్వారా సున్నితమైన అంశాలను ఆయన టచ్ చేసేవారు. నటుడిగా కూడా ఆయన మెప్పించారు. పలు చిత్రాల్లో నటించారు. చివరగా గత ఏడాది విడుదలైన 'గజన' మూవీలో ఆయన కనిపించారు.
'కదల్ కాదై' సినిమాలో తనతో కలిసి నటించిన షిర్లే దాస్ ను ఆయన 2017లో రెండో పెళ్లి చేసుకున్నారు. దర్శకనటి జయాదేవి ఆయన మొదటి భార్య.