Somireddy Chandramohan Reddy: ఇది రూ. 3,200 కోట్ల స్కామ్ మాత్రమే కాదు... 30 వేల ప్రాణాలు బలిగొన్న స్కామ్: సోమిరెడ్డి

Somireddy demands ED probe into AP liquor scam
  • ఏపీ లిక్కర్ స్కామ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందన్న సోమిరెడ్డి
  • లిక్కర్ స్కామ్ పై ఈడీ విచారణ జరిపాలని డిమాండ్
  • ఆర్థిక ఉగ్రవాదులపై మోదీ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారని వ్యాఖ్య
వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఇది కేవలం రూ. 3,200 కోట్ల స్కామ్ కాదని... 30 వేల మంది ప్రాణాలు బలిగొన్న స్కామ్ అని చెప్పారు. ఈ స్కామ్ ను దేశ సరిహద్దులు దాటించిన వైసీపీ నేతలకు స్వర్ణ పతకాలు ఇవ్వాలని అన్నారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, కాళేశ్వరం ప్రాజెక్టులపై ఈడీ విచారణ జరుగుతోందని... ఏపీలో జరిగిన భారీ లిక్కర్ స్కామ్ పై కూడా ఈడీ విచారణ జరపాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. రూ. 50 కోట్లు పెట్టి కుక్క పిల్లను కొన్నానని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు పెడితే... అది ఫేక్ అని కూడా తెలుసుకోకుండానే ఈడీ స్పందించిందని... ఏపీ లిక్కర్ స్కామ్ పై కూడా ఈడీ అదే విధంగా స్పందించాలని కోరారు. పహల్గామ్ టెర్రరిస్టులపై ప్రధాని మోదీ తీసుకున్న చర్యలు చూశామని... అదే విధంగా ఆర్థిక ఉగ్రవాదులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు.
Somireddy Chandramohan Reddy
Andhra Pradesh liquor scam
YSRCP
liquor scam
ED investigation
Kaleshwaram project
Delhi liquor case
financial terrorism

More Telugu News