Roja: రోజాపై భాను ప్రకాశ్ వ్యాఖ్యలను ఖండించిన యాంకర్ శ్యామల

Shyamala Slams Gali Bhanu Prakashs Remarks Against Roja
  • 2 వేలకు రోజా ఏమైనా చేసేదన్న భాను ప్రకాశ్
  • భాను వ్యాఖ్యలు మహిళా లోకం తల దించుకునేలా ఉన్నాయన్న శ్యామల
  • ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ పై వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల తీవ్ర విమర్శలు గుప్పించారు. రూ. 2 వేలు ఇస్తే రోజా ఏమైనా చేసేదని భాను ప్రకాశ్ అన్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలను శ్యామల ఖండించారు. 

భాను ప్రకాశ్ చేసిన వ్యాఖ్యలు మహిళా లోకం తలదించుకునేలా ఉన్నాయని ఆమె అన్నారు. మంత్రిగా పని చేసిన ఓ మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భానుపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మరోవైపు భాను ప్రకాశ్ చేసిన వ్యాఖ్యలపై రోజా స్పందిస్తూ... ఆయనను గాలిగాడు అంటూ విమర్శించారు.
Roja
Gali Bhanu Prakash
Anchor Shyamala
Nagari TDP MLA
YCP
Andhra Pradesh Politics
Roja Comments
Shyamala Condemns
Political Controversy
Telugu News

More Telugu News