Vijay Deverakonda: ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విజయ్ దేవరకొండ

Vijay Deverakonda admitted to hospital with dengue fever
  • డెంగీ జ్వరంతో బాధపడుతున్న విజయ్ దేవరకొండ
  • హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న రౌడీ హీరో
  • విజయ్ త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్న అభిమానులు
యూత్ లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఆసుపత్రిపాలయ్యారు. ఆయన డెంగీ జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. విజయ్ కు సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో, ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. విజయ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. 

విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే... ఆయన తాజా చిత్రం 'కింగ్ డమ్' ఈ నెల 31న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో ఆయన సరసన భాగ్యశ్రీ బోర్సే నటించగా... సత్యదేవ్ కీలక పాత్రను పోషించారు. మరోవైపు, బాలీవుడ్ లో రణవీర్ సింగ్ నటిస్తున్న 'డాన్ 3' సినిమాలో విలన్ పాత్ర కోసం విజయ్ ను చిత్ర నిర్మాతలు సంప్రదించారు. అయితే, ఈ ఆఫర్ కు విజయ్ ఓకే చెప్పారా? లేదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
Vijay Deverakonda
Vijay Deverakonda health
Vijay Deverakonda dengue
Vijay Deverakonda hospital
Kingdom movie
Bhagyashri Borse
Satya Dev
Don 3
Ranveer Singh

More Telugu News