Rahul Gandhi: రాహుల్, మల్లికార్జున ఖర్గేలపై పోలీసులు చర్యలు తీసుకుంటారు: హిమంత బిశ్వ శర్మ

Himanta Sarma Warns Police Action Against Rahul Gandhi Kharge
  • రాహుల్ వ్యాఖ్యల కారణంగా ఆక్రమణదారులు రెచ్చిపోయారన్న హిమంత
  • కబ్జాదారులకు అక్కడే ఇళ్లు నిర్మిస్తామని రాహుల్ అంటున్నారని మండిపాటు
  • గాంధీల కోసం జైళ్లు ఎదురు చూస్తున్నాయని వ్యాఖ్య
అవినీతి కేసుల్లో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ జైలుకు వెళతారంటూ ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై హిమంత తాజాగా స్పందించారు. రాహుల్ వ్యాఖ్యల కారణంగా తమ రాష్ట్రంలోని ఆక్రమణదారులు రెచ్చిపోయి పోలీసుల పైనే దాడి చేశారని అన్నారు. 

అటవీ ప్రాంతంలో ప్రజలు స్థిరపడేందుకు కుదరదని... కానీ, అటవీ ప్రాంతాన్ని కబ్జా చేసిన వారికి అదే స్థలంలో పునరావాసం కల్పిస్తామని, ఇళ్లు నిర్మిస్తామని రాహుల్ హామీ ఇచ్చారని ఆరోపించారు. రాహుల్ ప్రసంగాల కారణంగా రాష్ట్రంలోని ఆక్రమణదారులు రెచ్చిపోయారని, పోలీసుల పైనే దాడి చేశారని చెప్పారు. తమ ప్రసంగాలతో హింసను ప్రేరేపించినట్టు తేలితే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలపై పోలీసులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఇప్పటికే ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు చెందిన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుందని చెప్పారు. గాంధీల కోసం జైళ్లు ఎదురు చూస్తున్నాయని అన్నారు.
Rahul Gandhi
Himanta Biswa Sarma
Mallikarjun Kharge
Assam
Robert Vadra
Corruption Case
Land Encroachment
Police Action
Priyanka Gandhi
ED

More Telugu News