Lokesh Kanagaraj: త‌న త‌ప్పుని తెలుసుకొని.. సంజ‌య్ ద‌త్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్

Lokesh Kanagaraj reacts to Sanjay Dutt
  • ‘లియో’ సినిమాలో సంజ‌య్ ద‌త్ పాత్ర‌కు త‌గ్గిన ప్రాధాన్యం
  • త‌న‌ను ద‌ర్శ‌కుడు లోకేశ్‌ స‌రిగ్గా ఉప‌యోగించుకోలేద‌ని సంజూ అసంతృప్తి
  • ఆయ‌న మాట‌ల‌తో ఏకీభ‌విస్తూ లోకేశ్‌పై నెటిజ‌న్ల‌ తీవ్ర విమర్శలు 
  • తాజాగా ‘కూలీ’ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో ఈ వివాదంపై స్పందించిన ద‌ర్శ‌కుడు
  • సంజయ్ సార్ మాటల్లో నిజం ఉందంటూ సారీ చెప్పిన లోకేశ్ క‌న‌గ‌రాజ్
తమిళ యువ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్ తీసిన ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి వ‌రుస హిట్స్‌తో స్టార్ డైరెక్ట‌ర్‌గా మారారు. ఈ చిత్రాల‌ ద్వారా ఆయ‌న తనదైన మార్క్ చూపించారు. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం సూప‌ర్‌స్టార్‌ రజనీకాంత్‌తో ‘కూలీ’ సినిమా తీస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నాగార్జున, సత్యరాజ్, శ్రుతిహాసన్ కీలక పాత్రల్లో న‌టించ‌గా... బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. 

అయితే, లోకేశ్‌ కనగరాజ్‌.. దళపతి విజయ్‌తో చేసిన ‘లియో’ చిత్రంలో బాలీవుడ్ సీనియ‌ర్‌ నటుడు సంజయ్ దత్ కీల‌క పాత్రలో క‌నిపించిన విష‌యం తెలిసిందే. కానీ, సంజూ పాత్ర‌ అభిమానులను అంతగా ఆకట్టుకోలేదు. ఆ పాత్రకు సరైన గుర్తింపు లేక‌పోవ‌డంతో అభిమానులు నిరాశ‌కు గుర‌య్యారు. ఇటీవల సంజయ్ కూడా ఈ విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

లోకేశ్ త‌న‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడ‌ని, త‌న‌ క్యారెక్టర్ చాలా చిన్నదిగా, ప్రభావం లేనిదిగా చూపించాడ‌ని తెలిపారు. త‌న‌ను వేస్ట్ చేసుకున్నాడ‌ని సంజ‌య్ ద‌త్‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్య‌మాల్లో వైరల్ అయ్యాయి. దీంతో చాలామంది నెటిజన్లు ఆయ‌న‌ మాటలతో ఏకీభవిస్తూ, లోకేశ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. 

ఈ క్ర‌మంలో తాజాగా ‘కూలీ’ ప్రచార కార్య‌క్రమంలో పాల్గొన్న లోకేశ్‌ కనగరాజ్‌ ఈ వివాదంపై స్పందించారు. త‌న త‌ప్పు తెలుసుకొని సంజ‌య్ ద‌త్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఆయ‌న మాట్లాడుతూ... "సంజయ్ సార్ మాటల్లో నిజం ఉంది. ‘లియో’లో ఆయన పాత్రకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేకపోయాను. అది నా తప్పు. ఇప్పుడు నేను గుర్తించాను. భవిష్యత్తులో ఒక అవకాశం వస్తే, ఆయన ఇమేజ్‌కి తగిన పాత్రను అద్భుతంగా డిజైన్ చేస్తా. ఈ విషయంలో ఆయనను క్షమించమని కోరుతున్నా" అని అన్నారు.
Lokesh Kanagaraj
Sanjay Dutt
Leo movie
Coolie movie
Bollywood
Kollywood
Vijay Thalapathy
Tamil cinema
Indian cinema
Director apology

More Telugu News