Dubai: దుబాయ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు బంప‌రాఫ‌ర్.. 10 రోజుల వేతనంతో కూడిన ‘వివాహ సెలవు’

10 Days Paid Leave For Marriage Dubai Ruler Unveils New Leave Policy For Government Workers
  • ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పది రోజుల పాటు ‘వివాహ సెలవు’
  • ఈ మేర‌కు దుబాయ్ పాలకుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్ ప్ర‌క‌ట‌న‌
  • 2025 జనవరి 1 నుంచే ఇది అమ‌లు అవుతుంద‌ని వెల్ల‌డి
దుబాయ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పది రోజుల పాటు ‘వివాహ సెలవు’ను మంజూరు చేస్తున్నట్టు దుబాయ్ పాలకుడు, యూఏఈ ప్రధాని, ఉపాధ్యక్షుడు అయిన షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ ప్రకటించారు. ఈ పది రోజుల పాటు పూర్తి వేతనం చెల్లిస్తారని తెలిపారు. 2025 జనవరి 1 నుంచే ఇది అమ‌లు అవుతుంద‌ని పేర్కొన్నారు.

ఉద్యోగి సంక్షేమం, కుటుంబ విలువలకు గణనీయమైన ప్రోత్సాహకంగా దుబాయ్ ప్రభుత్వం ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 2025 డిక్రీ నంబర్ (31) ప్రకారం జారీ చేసిన ఈ కొత్త ఆదేశం ప్రభుత్వ రంగాలలో పనిచేస్తున్న యూఏఈ పౌరులకు వర్తిస్తుంది. ఖలీజ్ టైమ్స్ ప్రకారం , ఇందులో దుబాయ్ ప్రభుత్వ విభాగాలు, న్యాయ అధికారులు, సైనిక సిబ్బంది (అభ్యర్థులు మినహా), ఫ్రీ జోన్లు, ప్రత్యేక అభివృద్ధి మండలాలు మరియు దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (DIFC) వంటి సంస్థలు ఉన్నాయి.

ఇక‌, ఈ సెలవులను కేవలం వివాహ సమయంలో మాత్రమే కాకుండా ఏడాదిలో ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. ప్రత్యేక పరిస్థితుల్లో మరుసటి సంవత్సరం కూడా వినియోగించుకునే వీలుంది. ప్రొబేషనరీ కాలాన్ని పూర్తి చేసుకున్న ఉద్యోగులు యూఏఈ పరిధిలోని వ్యక్తులను తగిన అనుమతులతో వివాహం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి.
Dubai
Sheikh Mohammed bin Rashid Al Maktoum
UAE
government employees
marriage leave
wedding leave
paid leave
employee benefits
Dubai government
Khaleej Times

More Telugu News