Sai Pallavi: 'రామాయ‌ణ‌'లో సాయిప‌ల్ల‌విని సీత‌గా తీసుకుంది అందుకేన‌ట‌!

Ramayana Makers Explain Casting Sai Pallavi as Sita
  • భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌లో క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్‌గా 'రామాయ‌ణ' 
  • ఈ సినిమాలో రాముడిగా ర‌ణ్‌బీర్ కపూర్, సీత‌గా సాయిప‌ల్ల‌వి
  • గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగా ఉండ‌టం
  • అందం కోసం స‌ర్జ‌రీలు చేయించుకోక‌పోవ‌డం
  • ఈ కార‌ణాల‌తోనే సాయిప‌ల్ల‌విని సీత‌గా తీసుకున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డి
భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌లో క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ 'రామాయ‌ణ' ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో రాముడిగా ర‌ణ్‌బీర్ కపూర్, సీత‌గా సాయిప‌ల్ల‌వి న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అలాగే రావ‌ణుడి పాత్ర‌లో య‌శ్ న‌టిస్తుంటే.. హ‌నుమంతుడిగా స‌న్నీ డియోల్ క‌నిపించ‌నున్నారు. ఇక‌, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మేక‌ర్స్ పంచుకుంటున్నారు. 

ఈ క్ర‌మంలో తాజాగా కీల‌క పాత్ర‌లు పోషించిన‌ ర‌ణ్‌బీర్ కపూర్, సాయిప‌ల్ల‌విని తీసుకోవ‌డం వెనుక ఉన్న కార‌ణాన్ని మేక‌ర్స్ వెల్ల‌డించారు. రాముడిగా ర‌ణ్‌బీర్‌ను తీసుకోవడానికి కార‌ణం ఆయ‌న గొప్ప‌గా న‌టించే నైపుణ్యం, ప్రశాంతమైన వ్య‌క్తిత్వం అని తెలిపారు. అలాగే సీతా దేవిగా సాయిప‌ల్ల‌విని తీసుకోవ‌డానికి కార‌ణం ఆమె గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగా ఉండ‌టం, అందం కోసం స‌ర్జ‌రీలు చేయించుకోక‌పోవ‌డం అని మేక‌ర్స్ పేర్కొన్నారు. కృత్రిమం క‌న్నా స‌హజ అంద‌మే బాగుంటుంద‌నే సందేశం ఇచ్చిన‌ట్లు ఉంటుంద‌ని టీమ్ రామాయ‌ణ తెలిపింది. 

ఇక‌, ఇప్ప‌టికే విడుద‌లైన మూవీ గ్లింప్స్ రామాయ‌ణ‌పై అంచ‌నాల‌ను భారీగా పెంచేసింది. ఈ చిత్రం రెండు భాగాలుగా రానున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా మొద‌టి పార్ట్ 2026 దీపావ‌ళికి విడుద‌ల కానుంది. అలాగే రెండో పార్ట్ 2027 దీపావ‌ళికి వ‌స్తుంద‌ని ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.  


Sai Pallavi
Ramayana
Ranbir Kapoor
Yash
Sunny Deol
Bollywood
Indian Cinema
Mythological Movie
Sita
Rama

More Telugu News