Jagan Mohan Reddy: మీకేం తెలుసు? జగన్ ను ప్రశ్నిస్తూ పొగాకు రైతుల లేఖ

Tobacco Farmers Letter Questioning Jagan on Sakshi Articles
  • సాక్షి పత్రికలో  తప్పుడు కథనాలు వచ్చాయంటున్న రైతులు
  • పొగాకు సాగు చేయని వారిని బాధితులుగా చూపిస్తున్నారంటూ ఆవేదన
  • జగన్ కు పొగాకు రైతుల కష్టాలు తెలుసా అంటూ ప్రశ్న
సాక్షి పత్రికలో వచ్చిన కొన్ని కథనాల పట్ల పొగాకు రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు జగన్ కు సాక్షి పత్రిక మేనేజ్ మెంట్ కు లేఖ రాశారు. పొగాకు సాగు చేయని వారిని బాధితులుగా చూపించడం ఏంటని నిలదీశారు. జగన్ కు బ్లాక్ బర్లీ పొగాకు రైతుల కష్టాలు తెలుసా? పొగాకు రైతుల కష్టాలను జగన్ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారా? అని రైతులు ప్రశ్నించారు. 

తప్పుడు వార్తలతో రైతుల మనోధైర్యాన్ని దెబ్బతీసే కథనాలు రాయొద్దని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం తమ కోసం రూ.273 కోట్లు కేటాయించిందని... పర్చూరు, చిలకలూరిపేట, ప్రత్తిపాడు, అద్దంకి నియోజకవర్గ రైతుల కోసం మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని రైతులు ఆ లేఖలో స్పష్టం చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే, సాక్షిలో అసత్య కథనాలు రాస్తూ రైతులను ఆయోమయానికి గురిచేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. 
Jagan Mohan Reddy
Tobacco Farmers
Sakshi Newspaper
Andhra Pradesh Farmers
Black Burley Tobacco
Farmers Letter
Markfed
TDP Government
Tobacco Cultivation

More Telugu News