Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం

Hyderabad Metro Technical Issue Causes Delays
నాగోల్-రాయదుర్గం మార్గంలో సమస్య
ఆలస్యంగా నడుస్తున్న మెట్రో రైళ్లు
మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల ఇబ్బందులు
హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం తలెత్తడంతో నాగోల్ - రాయదుర్గం మార్గంలో రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యాయి. దీంతో ప్రయాణికులు మెట్రో స్టేషన్‌లలో వేచి చూడాల్సి వచ్చింది. సాంకేతిక లోపాన్ని సరిచేసేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలను అధిగమించేందుకు చాలామంది మెట్రో రైలును ఆశ్రయిస్తుంటారు. నెలవారీ పాస్‌లు తీసుకొని ప్రయాణాలు చేస్తుంటారు. అయితే, మెట్రో రైలులో సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
Hyderabad Metro
Hyderabad
Metro Rail
Nagoal
Raidurg
Metro technical issue
Metro delay

More Telugu News