Hyderabad Boxing Competition: హైదరాబాద్‌లో బాక్సింగ్ పోటీల్లో ఉద్రిక్తత.. బాక్సర్లు, కోచ్‌ల ఘర్షణ

Tension in Hyderabad Boxing Competitions Clash Between Boxers Coaches
  • షేక్‌పేటలో రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు
  • రిఫరీ తప్పుడు నిర్ణయం కారణంగా ఓడిపోయానంటూ ఓ బాక్సర్ వర్గీయుల దాడి
  • తలుపులు, కిటికీలు ధ్వంసం
హైదరాబాద్ నగరంలోని షేక్‌పేటలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలు గురువారం ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. పోటీల మధ్యలో బాక్సర్లు, కోచ్‌ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరు బాక్సర్ల మధ్య బౌట్ జరుగుతున్న సమయంలో ఈ వివాదం తలెత్తింది.

రిఫరీ తప్పుడు నిర్ణయం కారణంగానే తాను ఓటమి పాలయ్యానంటూ ఒక బాక్సర్ వర్గం అతడిపై దాడికి పాల్పడింది. ఈ ఘర్షణలో తలుపులు, కిటికీలు ధ్వంసం అయ్యాయి. అనంతరం ఇరు వర్గాలు గోల్కొండ పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి.
Hyderabad Boxing Competition
Telangana Boxing
Boxing Match Dispute

More Telugu News