Fahadh Faasil: ఫాజిల్ వాడేది కీప్యాడ్ ఫోనే... కానీ రేటెంతో తెలిస్తే వామ్మో అంటారు!

Fahadh Faasil Uses Keypad Phone Priced at 779 Lakhs
  • పహద్ ఫాజిల్ చేతిలో వెర్టు ఫోన్
  • ధర రూ.7.79 లక్షలు
  • సింప్లిసిటీలోనూ లగ్జరీ అంటున్న అభిమానులు
దక్షిణాది అగ్ర నటుడు ఫహద్ ఫాజిల్ 'మాలీవుడ్ టైమ్స్' చిత్రం పూజా కార్యక్రమంలో చేతిలో కీప్యాడ్ ఫోన్ తో కనిపించారు. అది చూసిన వారికి, అంత పెద్ద నటుడు ఇంకా కీప్యాడ్ ఫోనే వాడుతున్నారా అని సందేహం కలగక మానదు. అవడానికి అది కీ ప్యాడ్ ఫోనే అయినా, దాని ఖరీదు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు. దాని ఖరీదు భారత కరెన్సీలో రూ.7.79 లక్షలు. 

ఫహద్ ఉపయోగించిన ఈ ఫోన్ బ్రిటిష్ లగ్జరీ బ్రాండ్ వెర్టు (Vertu) నుంచి వచ్చిన 'వెర్టు అసెంట్ రెట్రో క్లాసిక్ కీప్యాడ్ ఫోన్'. చూసేందుకు ఈ ఫోన్ సాధారణ కీప్యాడ్ ఫోన్‌లా కనిపించినా, దాని హస్తకళా నైపుణ్యం, టైటానియం, లెదర్, సఫైర్ క్రిస్టల్ వంటి ఖరీదైన మెటీరియల్స్‌తో తయారైన లగ్జరీ ఫోన్. ఈ ఫోన్‌లో 2-అంగుళాల QVGA సఫైర్ క్రిస్టల్ డిస్‌ప్లే, 3G/క్వాడ్ బ్యాండ్ GSM, బ్లూటూత్, మైక్రో USB కనెక్టివిటీ, 3-మెగాపిక్సెల్ ఆటోఫోకస్ కెమెరా, 4GB ఆన్‌బోర్డ్ మెమరీ, వెబ్ బ్రౌజర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఫహద్ ఫాజిల్ స్మార్ట్‌ఫోన్‌లకు దూరంగా ఉంటూ, సోషల్ మీడియా ఖాతాలు లేకుండా సరళ జీవన శైలిని అనుసరిస్తారని ఆయన సహనటుడు వినయ్ ఫోర్ట్ గతంలో వెల్లడించారు. అయితే, ఈ వెర్టు ఫోన్ ధర గురించి తెలిసిన అభిమానులు 'సింప్లిసిటీలోనూ లగ్జరీ' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోన్ వెర్టు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో లేదు, దీంతో ఫహద్ దీన్ని చాలా కాలం కిందటే కొనుగోలు చేసి ఉంటారని భావిస్తున్నారు. 

మరోవైపు, ఫహద్ ఫాజిల్ సినిమాల పరంగా కూడా బిజీగా ఉన్నారు. 'ఒడుం కుతిర చాడుం కుతిర', 'కరాటే చంద్రన్', 'మారీసన్' వంటి చిత్రాలతో పాటు మోహన్‌లాల్, మమ్ముట్టితో కలిసి 'పేట్రియాట్' చిత్రంలో కూడా నటిస్తున్నారు.
Fahadh Faasil
Vertu phone
Vertu Ascent Retro Classic
Keypad phone
Malayalam actor
Luxury phone
Vinay Forrt
Odum Kuthira Chaadum Kuthira
Patriot movie
South Indian cinema

More Telugu News