KCR: కేసీఆర్ వచ్చి సూచనలు ఇస్తే స్వీకరిస్తాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Revanth Reddy Ready to Accept Suggestions from KCR
  • కేసీఆర్ కుటుంబం కడుపు నిండా విషం పెట్టుకొని మాట్లాడుతోందని విమర్శ
  • కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సూచన
  • తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలో పర్యటిస్తానన్న రేవంత్ రెడ్డి
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సూచనలు చేస్తే స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ కుటుంబం కడుపునిండా విషం పెట్టుకొని మాట్లాడుతోందని ఆరోపించారు. కేసీఆర్ మొదట అసెంబ్లీకి రావాలని సూచించారు.

తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలో పర్యటిస్తానని ముఖ్యమంత్రి వెల్లడించారు. రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని అన్నారు. బతుకమ్మ చీరలు, కేటీఆర్ కిట్ మినహా పాత పథకాలన్నీ అమల్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖలు రాయడం ఆపేసి, ఒక ప్రణాళికతో ముందుకు రావాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
KCR
KCR Telangana
Revanth Reddy
Telangana Politics
BRS Party
Telangana Assembly

More Telugu News