Nara Lokesh: బోయ నరసింహులు కుటుంబానికి అండగా ఉంటానని మంత్రి లోకేశ్ హామీ

Nara Lokesh Assures Support to Boye Narasimhulu Family
  • ఫ్యాక్షన్ బారినపడి సర్వం కోల్పోయిన బోయ నరసింహులు కుటుంబం
  • ప్రత్యర్థుల చేతుల్లో బోయ నరసింహులు సహా ముగ్గురి హత్య
  • కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని మాట్లాడిన మంత్రి లోకేశ్‌
రాయలసీమలో ఫ్యాక్షన్ బారినపడి నష్టపోయిన కుటుంబాలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఉండవల్లి నివాసానికి పిలుపించుకుని మాట్లాడారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం కామిరెడ్డిపల్లికి చెందిన దాసరి నరసింహులు టీడీపీలో మొదటి నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. 2011లో ప్రత్యర్థులు దారికాచి ద్విచక్రవాహనంపై వెళుతున్న బోయ నరసింహులు సహా అతని కుమారుడు, కుమార్తెను దారుణంగా హత్య చేయడం సంచలనం సృష్టించింది. 

ఫ్యాక్షన్ బారిన పడి బోయ నరసింహులు కుటుంబం ఎంతో నష్టపోయింది. అప్పట్లో పార్టీ అధినేత చంద్రబాబు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఇప్పుడు మృతుడి కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి ఆహ్వానించిన మంత్రి నారా లోకేశ్‌.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

మృత్యుంజయ చిన్నారిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేశ్‌
ఆనాటి ఫ్యాక్షన్ హత్యా ఘటనలో రెండు నెలల చిన్నారి మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. సదరు బాలుడిని మంత్రి లోకేశ్‌ ఆప్యాయంగా పలకరించారు. చదువు వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకుని ఉన్నతస్థాయికి వెళ్లాలని, తాను కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఉండవల్లి నివాసానికి పిలుపించుకుని తమ యోగక్షేమాలు వాకబు చేయడం పట్ల బోయ నరసింహులు కుటుంబసభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Nara Lokesh
Boye Narasimhulu
Andhra Pradesh
Faction politics
Anantapur
TDP
Victim support
Political violence
Dharmavaram
Kamireddipalle

More Telugu News