Sanjay Dutt: 30 కోట్లు పెడితే వచ్చింది సగమే!

The Bhoothnii Movie Update
  • హారర్ కామెడీ చిత్రంగా 'ది భూత్ నీ'
  • మే 1న విడుదలైన సినిమా
  • ప్రధానమైన పాత్రల్లో మౌనీరాయ్ - సన్నీ సింగ్ 
  • కీలకమైన పాత్రలో సంజయ్ దత్  
  • రేపటి నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్

 ఎలాంటి కంటెంట్ కావాలని ఆడియన్స్ ను అడిగితే, చాలామంది హారర్ థ్రిల్లర్ జోనర్  వైపే నిలబడతారు. ఏం జరుగుతుందా అనే ఒక కుతూహలాన్ని రేకెత్తించే ఈ తరహా కాన్సెప్టులను ఎంతో ఇష్టంతో ఆదరిస్తూ ఉంటారు. అయితే ఈ జోనర్లో ఒక మేజిక్ ఉంది. కంటెంట్ తప్ప మరేమీ ఇక్కడ వర్కౌట్ కాదు. అందువల్లనే తక్కువ బడ్జెట్ తో చేసిన సినిమాలు ఎక్కువ లాభాలు రాబడితే, కాస్త పెద్ద బడ్జెట్ లో చేసినవి బోల్తా పడుతుంటాయి. 

అందుకు రీసెంట్ గా చెప్పుకునే ఉదాహరణగా 'ది భూత్ నీ' కనిపిస్తుంది. సంజయ్ దత్ .. సన్నీ సింగ్ .. మౌనీ రాయ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, సిద్ధాంత్ సచ్ దేవా దర్శకత్వం వహించాడు. సంజయ్ దత్ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన ఈ సినిమా, మే 1వ తేదీన థియేటర్లకు వచ్చింది. 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, రన్ టైమ్ ముగిసే సమయానికి 14 కోట్లకి పైగా మాత్రమే రాబట్టగలిగింది.

ఈ సినిమా ఓటీటీకి వస్తే చూద్దామనే ఆసక్తితో చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'జీ 5' నుంచి ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. కాలేజ్ ఆవరణలోని ఒక చెట్టుపై ఉన్న ప్రేతాత్మ, ఒక యువకుడి కారణంగా మేల్కొంటుంది. పర్యవసానంగా చోటు చేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనేదే కథ. 

Sanjay Dutt
The Bhooth Returns
horror thriller
Sunny Singh
Mouni Roy
Zee5
OTT release
Bollywood movie
Siddhant Sachdeva
box office collection

More Telugu News