Akash Prime: 'ఆకాశ్ ప్రైమ్' ను విజయవంతంగా పరీక్షించిన భారత సైన్యం

Akash Prime Successfully Tested by Indian Army in Ladakh
  • లడఖ్ లో ఆకాశ్ ప్రైమ్ ఎయిర్ మిసైల్ ను పరీక్షించిన భారత ఆర్మీ ఎయిర్ డిఫెన్స్
  • గగనతలంలో వేగంగా భిన్న దశల్లో కదిలే రెండు లక్ష్యాలను చేధించిన ఆకాశ్ ప్రైమ్
  • ఆపరేషన్ సిందూర్ లోనూ సత్తా చాటిన అకాశ్ మిసైల్
దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్ ప్రైమ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థను భారత సైన్యం విజయవంతంగా పరీక్షించింది. నిన్న లడఖ్‌లో సముద్రమట్టానికి 15 వేల అడుగుల ఎత్తులో భారత ఆర్మీ గగనతల లక్ష్యాలను ఛేదించే ఆకాశ్ ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.

క్షిపణిని అభివృద్ధి చేసిన రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) సీనియర్ అధికారుల సమక్షంలో ఈ ప్రయోగ పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో భారత సైనిక దళాల వైమానిక రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించే దిశలో మరో కీలక విజయాన్ని సాధించినట్లు అయింది.

గగనతలంలో వేగంగా భిన్న దశల్లో కదిలే రెండు లక్ష్యాలను ఆకాశ్ ప్రైమ్ మిసైల్ అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది. అననుకూల వాతావరణంలోనూ పూర్తి సమర్థతతో పనిచేసి ఆకాశ్ క్షిపణి తన సత్తా చాటింది. భారత సైన్యంలోని మూడో, నాలుగో ఆకాశ్ రెజిమెంట్లలో ఈ కొత్త ఆకాశ్ ప్రైమ్ క్షిపణులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఇది కొత్తగా పరీక్షించబడిన వ్యవస్థ కాదు. ఇంతకు ముందు ఆపరేషన్ సిందూర్ వేళ పాకిస్థాన్ నుంచి దూసుకొచ్చిన డ్రోన్లు, క్షిపణులను ఆ ఆకాశ్ ప్రైమ్ మిసైల్ విజయవంతంగా అడ్డుకుని తన సమర్థతను నిరూపించుకుంది. అధిక ఎత్తు, తక్కువ ఉష్ణోగ్రతలు, తక్కువ వాయు పీడనం లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ శత్రు విమానాలను తాకడానికి ఇది అనువుగా ఉంటుంది. కాగా, ఈ ప్రయోగానికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
Akash Prime
Indian Army
DRDO
Surface to Air Missile
Air Defence System
Ladakh
Missile Test
Operation Sindoor
Drone Interception
Military Technology

More Telugu News