Vishal: సినిమా రివ్యూల‌ను ఉద్దేశించి న‌టుడు విశాల్ కీల‌క వ్యాఖ్య‌లు

Vishal Comments on Movie Reviews and Public Reactions
  • ఏదైనా సినిమా విడుద‌లైన వెంట‌నే ప‌బ్లిక్ రియాక్ష‌న్స్ తీసుకోవ‌డం స‌రికాద‌ని వ్యాఖ్య‌
  • ఆ ప‌ద్ధ‌తిని మార్చుకోవాల‌ని కోరిన విశాల్‌
  • సినిమాను బ‌తికించాల్సిన అవ‌స‌రం అంద‌రిపై ఉంద‌న్న న‌టుడు
  • అలాగే త‌న పెళ్లి గురించి ఆస‌క్తిక వ్యాఖ్య‌లు
సినిమా రివ్యూల‌ను ఉద్దేశించి న‌టుడు విశాల్ తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏదైనా సినిమా విడుద‌లైన వెంట‌నే ప‌బ్లిక్ రియాక్ష‌న్స్ తీసుకోవ‌డం స‌రికాద‌ని తెలిపారు. ఆ ప‌ద్ధ‌తిని మార్చుకోవాల‌ని కోరారు. సినిమాను బ‌తికించాల్సిన అవ‌స‌రం అంద‌రిపై ఉంద‌న్నారు. ఈ మేర‌కు విశాల్ తాజాగా పాల్గొన్న‌ 'రెడ్ ఫ్ల‌వ‌ర్' మూవీ ఈవెంట్‌లో వ్యాఖ్యానించారు.  

విశాల్ మాట్లాడుతూ... "న‌డిగ‌ర్ సంఘం త‌ర‌ఫున ఎగ్జిబిట‌ర్ల అసోసియేష‌న్‌, మీడియాకు నాదొక విన్న‌పం. ప్ర‌తి శుక్ర‌వారం మార్కెట్‌లో ఎన్నో కొత్త సినిమా విడుద‌ల అవుతుంటాయి. ఏదైనా సినిమా రిలీజైన వెంట‌నే యూట్యూబ‌ర్లు థియేట‌ర్ల వ‌ద్దకు చేరుకుని ప‌బ్లిక్ రియాక్ష‌న్స్ తీసుకుంటారు. 

ఇలా చేయ‌డం వ‌ల్ల ఒక సినిమాకు రావాల్సిన ఆద‌ర‌ణ రావ‌డం లేదు. అలా కాకుండా యూట్యూబ‌ర్ల‌కు ఓ మూడు రోజుల పాటు అలా ప‌బ్లిక్ రియాక్ష‌న్స్ తీసుకోవ‌డానికి అనుమ‌తించ‌కూడ‌దు. క‌నీసం 12 షోలు పూర్తి అయ్యేవ‌ర‌కు ఈ రూల్స్ ఉంటే బాగుంటుంది. సినిమాను బ‌తికించాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉంది" అని ఆయ‌న అన్నారు. 

అనంత‌రం త‌న పెళ్లి గురించి మాట్లాడుతూ, మ‌రో రెండు నెల‌ల్లో త‌ప్ప‌కుండా శుభ‌వార్త చెబుతాన‌ని అన్నారు. న‌డిగ‌ర్ సంఘం భ‌వ‌నం పూర్తి చేసిన త‌ర్వాత పెళ్లి చేసుకోవాలని చాలా కాలంగా అనుకుంటున్న‌ట్లు చెప్పారు. దాని కోసం సుమారు తొమ్మిదేళ్లుగా శ్ర‌మిస్తున్నాన‌ని, బిల్డింగ్ ప‌నులు చివ‌రి ద‌శ‌కు చేరుకున్న‌ట్లు తెలిపారు. ప‌నులు రెండు నెల‌ల్లో పూర్త‌వుతాయ‌ని, త‌న బ‌ర్త్‌డే నాడు గుడ్ న్యూస్ చెబుతాన‌ని విశాల్ అన్నారు. 

కాగా, న‌టి సాయి ధ‌న్సిక‌ను విశాల్ ప‌రిణ‌య‌మాడ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఆగ‌స్టులో ఈ జంట వివాహబంధంలోకి అడుగుపెట్ట‌బోతున్న‌ట్లు ఇటీవ‌ల ఓ సినిమా ప్ర‌మోష‌న్‌లో వారిద్ద‌రూ అధికారికంగా ప్ర‌క‌టించారు.
Vishal
Vishal marriage
Vishal comments
Red Flower movie event
movie reviews
public reactions
Nadigar Sangam
Sai Dhansika
Tamil cinema
cinema release

More Telugu News