CMRF: సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్‌మాల్.. నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు
- తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత 19 చెక్కుల డబ్బులను కాజేసిన నిందితులు
- ఎవరూ సంప్రదించని చెక్కులకు సంబంధించిన డబ్బులు తీసుకున్న నిందితులు
- అరెస్టు చేసి విచారణ జరుపుతున్న పోలీసులు
ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల గోల్‌మాల్ వ్యవహారంలో హైదరాబాద్‌లోని జుబ్లీహిల్స్ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. మెట్టుగూడకు చెందిన జోగుల రమేశ్, వనస్థలిపురానికి చెందిన వెంకటేశ్, ఖమ్మంకు చెందిన వంశీ, పెద్దపల్లికి చెందిన ఓంకార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ఎవరూ సంప్రదించని 19 చెక్కులకు సంబంధించిన సొమ్మును వీరు తీసుకున్నారు. ఫోర్జరీ పత్రాలతో వాటిని వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్నారు. జోగుల రమేశ్ గతంలో ఓ మంత్రి కార్యాలయంలో పనిచేసినట్లు సమాచారం. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఈ వ్యవహారంపై మరింత సమాచారం రాబడుతున్నారు.