హస్తినలో ముగిసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం
- జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం
- దాదాపు గంటన్నర పాటు సమావేశం
- కేంద్రం ఎదుట వాదనలు వినిపించిన ఇరు రాష్ట్రాలు
గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు అనుసంధానం సింగిల్ పాయింట్ ఎజెండాగా ఆంధ్రప్రదేశ్.. 13 అంశాలతో తెలంగాణ ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఇరు రాష్ట్రాలు తమ తమ వాదనలను కేంద్రం ముందు ఉంచాయి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రులతో పాటు ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ కార్యదర్శులు, ఇంజినీర్లు హాజరయ్యారు.