Mamata Banerjee: కోల్‌కతాలో వర్షంలో నిరసన తెలిపిన మమతా బెనర్జీ

Mamata Banerjee Protests in Kolkata Rain Against BJP
  • బెంగాల్ భారతదేశ స్వేచ్ఛ కోసం పోరాడిందన్న మమతా బెనర్జీ
  • బీజేపీ ఏమనుకుంటోందని నిలదీసిన బెంగాల్ ముఖ్యమంత్రి
  • బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శ
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే వారిని వేధిస్తున్నారని ఆరోపిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వర్షంలో సైతం నిరసన మార్చ్ నిర్వహించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బెంగాలీ వలసదారులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆమె ఆరోపించారు. బెంగాల్ భారతదేశ స్వేచ్ఛ కోసం పోరాడిందని ఆమె అన్నారు. బెంగాలీలను వేధిస్తున్నందుకు బీజేపీ సిగ్గుపడాలని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.

"అసలు బీజేపీ ఏమనుకుంటోంది? బెంగాలీలను బాధపెడతారా? వారిని రోహింగ్యాలు అని పిలుస్తున్నారు. రోహింగ్యాలు ఇక్కడ కాదు, మయన్మార్‌లో ఉన్నారు. 22 లక్షల మంది పేద వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారు స్వదేశానికి తిరిగి రావాలని నేను వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. వారు ఇక్కడ సురక్షితంగా ఉంటారు. బీజేపీ బెంగాలీ మాట్లాడే వారిని నిర్బంధ శిబిరాలకు పంపుతోంది. పశ్చిమ బెంగాల్ భారతదేశంలో లేదా?" అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. బెంగాలీల త్యాగం, స్వాతంత్ర్య సమరయోధులను బీజేపీ మరచిపోయిందా అని ఆమె నిలదీశారు.


Mamata Banerjee
Mamata Banerjee protest
West Bengal
Bengali
BJP
Rohingya
Kolkata
Voter list
Bengali migrants
India

More Telugu News