Stock Market: ఇన్వెస్టర్ల అప్రమత్తత... స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Stock Markets Close Marginally Higher Amid Investor Caution
  • 63 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 16 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 85.94
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. అమెరికా-భారత్ మధ్య ట్రేడ్ డీల్ పై ఇంకా స్పష్టత రాకపోవడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 63 పాయింట్ల లాభంతో 82,634కి పెరిగింది. నిఫ్టీ 16 పాయింట్లు పెరిగి 25,212 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 85.94గా ఉంది.

బీఎస్ఈ సెన్సెక్స్ లో మహీద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్ తదితర కంపెనీలు ప్రధానంగా లాభపడ్డాయి. ఎటర్నల్, సన్ ఫార్మా, టాటా మోటార్స్, టాటా స్టీల్, బీఈఎల్ తదితర షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.


Stock Market
Sensex
Nifty
Indian Stock Market
Share Market
Trade Deal
Investment
Mahindra and Mahindra
Infosys
Adani Ports

More Telugu News