Komatireddy Venkat Reddy: కృష్ణా జలాలను చంద్రబాబు, జగన్ అక్రమంగా తరలించారు... బనకచర్లను ఒప్పుకోం: కోమటిరెడ్డి

Telangana Minister Komatireddy Opposes Banacharla Project
  • కేంద్ర జలశక్తి మంత్రితో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం
  • బనకచర్ల అంశం ఒకటే అజెండాగా పెడితే చర్చకు రాలేమని ఇప్పటికే స్పష్టం చేశామన్న కోమటిరెడ్డి
  • కాళేశ్వరం కూలిపోతే  ప్రపంచ వింత అవుతుందని ఎద్దేవా
కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నేపథ్యంలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఏపీ ప్రతిపాదిస్తున్న బనకచర్లను ఒప్పుకునే పరిస్థితే లేదని అన్నారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్ అంశం ఒక్కటే అజెండాగా పెడితే చర్చకు రాలేమని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశామని తెలిపారు. 

ఇప్పటికే తెలంగాణకు చెందిన కృష్ణా జలాలను చంద్రబాబు, జగన్ ఏపీకి తరలించుకుపోయారని కోమటిరెడ్డి అన్నారు. భవిష్యత్తులో గోదావరిపై నాసిక్ లో ప్రాజెక్టు కడిగే తెలంగాణ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే ఒక వింత అని... అది కూలిపోతే ప్రపంచంలో మరో వింతగా మారుతుందని ఎద్దేవా చేశారు. మేడిగడ్డ ప్రాజెట్లు మొత్తం కూలిపోతుందని ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్టు కూడా ఇచ్చిందని తెలిపారు. 
Komatireddy Venkat Reddy
Krishna River
Godavari River
Telangana
Andhra Pradesh
AP
TS
Banacharla Project
Kaleshwaram Project
Chandrababu Naidu
YS Jagan Mohan Reddy

More Telugu News